
జగన్ సమక్షంలో రేపు ధర్మాన చేరిక
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వెళ్లిపోతున్నారంటూ వస్తున్న కథనాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని ఆపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వెళ్లిపోతున్నారంటూ వస్తున్న కథనాలను ఎవరూ నమ్మాల్సిన అవసరం లేదని ఆపార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె శనివారమిక్కడ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహనప్ రెడ్డి సమక్షంలో ఆదివారం మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తైనాల విజయ్ కుమార్, జగన్నాయకులు పార్టీ చేరుతున్నట్లు తెలిపారు. అలాగే నందమూరి లక్ష్మీ పార్వతి కూడా రేపు జగన్ సమక్షంలో శ్రీకాకుళంలో జరిగే సభలో పార్టీ సభ్యత్వం తీసుకుంటారని వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అనేమంది సీనియర్లు ఉత్సాహం చూపుతున్నారని ఆమె తెలిపారు.