కన్నీటి కష్టాలు! | Difficulties in tears! | Sakshi
Sakshi News home page

కన్నీటి కష్టాలు!

Published Wed, Oct 22 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM

కన్నీటి కష్టాలు!

కన్నీటి కష్టాలు!

కర్నూలు రూరల్ :
 కర్నూలు జిల్లా ప్రజలకు తాగునీటి కష్టాలు పొంచి ఉన్నాయూ?
 ఎండాకాలానికి వుుందే గుక్కెడు నీటి కోసం తపించాల్సిన దుస్థితి ఎదురుకానుందా?
 వురో వారం రోజుల తర్వాత జిల్లా ప్రజల గొంతు ఎండిపోనుందా?


 ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సవూధానమే వస్తోంది. ఒకవైపు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిరాటంకంగా జరుగుతుండటం.. వురోవైపు సుంకేసుల, టీబీ డ్యాముల్లో నీటి నిల్వలు పడిపోవడంతో వారం రోజుల్లో కన్నీటి కష్టాలు ఎదురుకానున్నారుు. ఒకవైపు వర్షాలు లేకపోవడం, ఉన్న నీటి వనరులను వుుందు చూపుతో ఒడిసి పట్టాల్సిన పాలకుల నిర్లక్ష్యం జిల్లా ప్రజలను నీటి కష్టాల బారిన పడేసింది. ఇప్పటికైనా వుుందు చూపుతో తుంగభద్ర డ్యామ్ నుంచి నీటిని విడుదల చేస్తే మినహా నీటి కష్టాల నుంచి గట్టెక్కే పరిస్థితులు కనుచూపు మేరలో లేవు.

 ఇన్‌ఫ్లో నిల్...!
 రిజర్వాయుర్లలోకి నీటి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోయింది. తుంగభద్ర నదిపై కర్నూలు మండలం సుంకేసుల గ్రామం దగ్గర నిర్మించిన కోట్ల విజయభాస్కరరెడ్డి బ్యారేజిలో నీటి నిల్వలు భారీగా తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం బ్యారేజిలోకి నీరు వచ్చి చేరడం లేదు. ఈ బ్యారేజి నీటిపై కర్నూలు-కడప కాలువ కింద 0 కి.మీ., నుంచి 150 కి.మీ., వరకు ఉన్న 40 వేల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. ప్రస్తుతం ఈ ఆయకట్టుకు రోజుకు 2534 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

అధికారులు నీటి చేరికపై ముందు చూపు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం వల్ల ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు వచ్చినా టీబీ డ్యామ్ నుంచి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కేసీకి రావాల్సిన వాటా నీటి కోసం ప్రభుత్వానికి ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. సుమారు నెల రోజులకు పైగా వర్షాలు లేవు. తుంగభద్ర నదిలో ఇన్‌ఫ్లో లేదు. ప్రస్తుతం కేసీకి వదులుతున్న నీరు మరో 5 రోజుల పాటు కొనసాగితే కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజి డెడ్ స్టోరేజికి చేరుకునే అవకాశం ఉంది. బ్యారేజి పూర్తి స్థాయి సామర్థ్యం 1.20 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.08 టీఎంసీలకు నీటి నిల్వలు పడిపోయాయి. కర్నూలు నగరంలో నివసిస్తున్న సుమారు ఐదున్నర లక్షల మంది జనాభా తాగు నీరు ఈ బ్యారేజి నీటిపై ఆధారపడి ఉంది.

శ్రీశైలంలోనూ నీటి నిల్వ 854 అడుగులకు చేరువలో ఉంది. దీంతో పోతిరెడ్డిపాడుకు నీటి విడుదల నిలిచిపోరుుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి.. టీబీ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయిస్తే తప్ప.. తాగునీటి ముప్పు తప్పేలా లేదు.

 పోతిరెడ్డిపాడుకు నీళ్లు బంద్..
 కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి నిల్వలు భారీగా పడిపోతున్నాయి. ప్రస్తుతం 858.6 అడుగులకు చేరుకోవడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు సాగునీటి విడుదల నిలిపివేశారు. రిజర్వాయర్ కనీస నీటి మట్టం 854 అడుగులకు చేరువలో ఉండటంతో సాగు నీటిని బంద్ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ శ్రీశైలం ఎడమగట్టు పవర్‌హౌస్ నుంచి తెలంగాణ ప్రభుత్వం 38 వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ విద్యుత్తును నిర్విరామంగా ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది.

తానేమీ తక్కువ తినలేదన్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో సాయుంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు (పీక్ అవర్స్‌లో) విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ నీటిని వదిలేస్తోంది. తెలంగాణలో ఏర్పడిన విద్యుత్ కొరతను తీర్చుకునేందుకు 834 అడుగుల వరకు శ్రీశైలం నీటిని వినియోగించి పవర్ జనరేట్ చేసుకునేందుకు కృష్ణానది యాజమాన్య బోర్డు అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. గత నెల 20వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు హాజరయ్యారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఇరిగేషన్ ఇంజినీర్లు విద్యుదుత్పత్తికి నీటిని వినియోగించుకునేందుకు అనుమతి తీసుకున్నారు. ఇదే సమావేశంలో కర్నూలు జిల్లా నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ పాల్గొన్నా.. ఆ అనుమతిపై ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇందుకు కారణం ఆ అధికారి కోస్తా ప్రాంతానికి చెందిన వ్యక్తి కావడం వల్ల రాయలసీమ సాగునీటి కాల్వల గురించి విస్మరించినట్లు అధికారులు చర్చించుకుంటున్నారు. తెలంగాణ ప్రాంతం వారు విద్యుదుత్పత్తి చేస్తున్నారు.

తామెందుకు చేయకూడదంటు కుడిగట్టు పవర్ హౌస్ నుంచి రాత్రి 7.30 గంటల నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు విడతల వారీగా పవర్ జనరేట్ చేస్తూ నీటిని దిగువకు వదులుతున్నారు. వారం రోజుల నుంచి ఈ తతంగం జరుగుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కృష్ణా నది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేస్తే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని సాగు నీటి నిపుణులు చెబుతున్నారు.

 పంటలకూ కష్టకాలమే...!
 శ్రీశైలం రిజర్వాయర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా విడుదలయ్యే నీటిపై తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్ ఎస్కేప్ చానల్ కింద 3.43 లక్షల ఎకరాల ఆయకట్టు సాగయ్యింది. రిజర్వాయర్‌లో నీటి నిల్వలు పడిపోవడంతో పోతిరెడ్డిపాడుకు సాగునీరు బంద్ చేశారు. ప్రస్తుతం నీటి నిల్వలను బట్టి చూస్తుంటే ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం లేనట్లేననే నీటి పారుదల శాఖ అధికారులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పంటలు ప్రస్తుతం మధ్య దశలో ఉన్నాయి. ఈ సమయంలో సాగునీరు బంద్ కావడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు స్పందించి విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేస్తే కొంత మేర పంట నష్టాన్ని తగ్గించవచ్చని పలువురు అన్నదాతలు వాపోతున్నారు.
 
 నీటి నిల్వలు ఇలా...
 ప్యాజెక్ట్ పేరు    పూర్తిస్థాయి నీటిమట్టం        ప్రస్తుత నీటిమట్టం        ఇన్‌ఫ్లో
                                                              (అడుగులలో)            (అడుగులలో)
 శ్రీశైలం         885  (212 టీఎంసీలు)        858 (102 టీఎంసీలు)        --
 తుంగభద్ర    1633 (104టీఎంసీలు)        1632(100 టీఎంసీలు)      2,300 క్యూసెక్కులు
 సుంకేసుల    292 (1.20టీఎంసీలు)         291(1.08టీఎంసీలు)        --

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement