
మంత్రి కామినేని శ్రీనివాస్
ఏపిలో వైద్యశాఖకు జబ్బు చేసిందని ఆరోగ్య,వైద్య విద్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు.
కడప: ఏపిలో వైద్యశాఖకు జబ్బు చేసిందని ఆరోగ్య, వైద్య విద్యా శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. దీనిని గాడిలో పెడతామని చెప్పారు. వైఎస్ఆర్ జిల్లా వేంపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యులు స్థానికంగానే నివాసం ఉండాలని చెప్పారు.
అనంతరం మంత్రి పులివెందులలోని ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అసౌకర్యాలపై సూపరింటెండెంట్ను మందలించారు.
ఇదిలా ఉండగా, మంత్రి .కామినేని శ్రీనివాసరావు పులివెందులలో బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించారు.
**