సాక్షి, విశాఖపట్నం : హుదూద్ దెబ్బకు ఉత్తరాంధ్రలో బ్యాంకింగ్ రంగం కుదేలైంది. కొన్ని చోట్ల చెట్లు,విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలుబ్యాంకులు, ఏటీఎంలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. కోర్ బ్యాంకిం గ్ వ్యవస్థ పనిచేయకపోఉడంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఏటీఎంలపై ఉండే యాంటినాలు పెనుగాలులకు కొట్టుకుపోవడంతో 85శాతానికి పైగా ఏటీఎంలు మూడురోజుల పాటు పనిచేయలేదు. విద్యుత్ సరఫరా లేక బ్యాంకులు సైతం మూతపడడంతో లావాదేవీలు స్తంభించిపోయాయి.
సోమ,మంగళ, బుధవారాల్లో ఉత్తరాంధ్రలో రూ.1200కోట్ల మేర లావాదేవీలకు బ్రేకులుపడ్డాయి. ఉత్తరాంధ్రలో 62 సహకార, జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులకు సంబంధించి 1200 శాఖల వరకు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా విశాఖలో 250 శాఖలుండగా, జిల్లా పరిధిలోనే 750కు పైగా శాఖలున్నాయి. ఉత్తరాంధ్ర పరిధిలోని మూడు జిల్లాల్లో అన్ని బ్యాంకులద్వారా క్లియరింగ్ చెక్స్, ఇంటర్ బ్యాంక్ పేమెంట్స్, రెమిడెన్స్ వంటి సేవల ద్వారా ప్రతీరోజు రూ.500 నుంచి రూ.600 కోట్ల మేర వ్యాపారం జరుగుతుంటుంది. తుఫాన్‌దెబ్బకు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థకు కీలకమైన యాంటినాలు ఎగిరిపోవడంతో సోమ,మంగళవారాల్లో బ్యాంకులు, ఏటీఎంలు పూర్తిగా మూత పడ్డాయి.
బుధవారం జనరేటర్ల సాయంతో ప్రధాన బ్యాంకులు తెరిచిన ప్పటికీ సాంకేతిక సమస్యలతో పూర్తిస్థాయిలో లావాదేవిలు ప్రారంభం కాలేదు. మరొకపక్క సాధ్యమైంతత్వరగా ఏటీఎంలను పనిచే సేలా చూడాలని అవుట్‌సోర్సింగ్ సంస్థలయిన టాటా, ప్రిజమ్స్, బింక్స్ ఆరియా, సీఎంఎస్ సంస్థలకు ఆయా బ్యాం కులు ఉన్నతాధికారులు ఆదేశించ డంతో యుద్ద ప్రాతిపదికన పునర్ని ర్మాణ చర్యలు చేపట్టారు. బుధవారం ఏటీఎంలు పాక్షికంగా పనిచేసినప్పటికీ కోర్‌బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలడంతో చాలా చోట్ల ఏటీఎంల వద్ద నాట్ వర్కింగ్ బోర్డులే దర్శనమిచ్చాయి.
విద్యుత్ లేమి సమస్య ఉన్నప్పటికీ జనరేటర్లసాయంతో గురువారం నుంచి పూర్తిస్థాయిలో బ్యాంకింగ్ సేవలు మొదలయ్యాయి. 80శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి. కోర్ బ్యాంకింగ్ సమస్య వల్ల సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. హుదూద్ దెబ్బకు ఈమూడు జిల్లాల్లో ఆస్తుల ధ్వంసం వల్ల బ్యాంకింగ్ రంగానికి రూ.5కోట్ల వరకు నష్టంవాటిల్లి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
బ్యాంకింగ్ రంగానికి విఘాతం
Published Sat, Oct 18 2014 2:48 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement
Advertisement