జిల్లాలో డిజిటల్ లాకర్ అమలుకు కలెక్టర్ కసరత్తు
ప్రతి యూజర్‌కు 10 ఎంబీ స్పేస్ కేటాయింపు
జనన ధ్రువీకరణ ప్రతం నుంచి పాస్‌పోర్ట్ వరకు అన్నీ లాకర్‌లో నిక్షిప్తం
విజయవాడ : ఇప్పుడంతా డిజిటల్ యుగం. అన్ని పనులూ కంప్యూటర్, ఇంటర్నెట్‌లోనే అయిపోతున్నాయి. దీన్ని ప్రజలు ఆచరిస్తున్నా, లేకపోయినా సర్కారు మాత్రం పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డిజిటల్ లాకర్ విధానాన్ని జిల్లాలోనూ అమలు చేయాలని కలెక్టర్ బాబు ఎ. నిర్ణయించారు. బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే డిజిటల్ లాకర్‌పై విస్తృత ప్రచారం చేయడంతోపాటు ప్రజలకు అవగాహన పెంచి అందరూ డిజిటల్ ఖాతాలు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కలెక్టర్ దీనిపై అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
డిజిటల్ లాకర్ అంటే..
డిజిటల్ లాకర్‌లో ఒక వ్యక్తికి సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రం నుంచి పాస్‌పోర్ట్ వరకు అన్ని విలువైన పత్రాలను స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదో తరగతి మార్కుల జాబితా, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డు.. ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లను స్కాన్ చేసి డిజిటల్ లాకర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి లాకర్‌కు 10 ఎంబీ స్పేస్‌ను కేటాయిస్తారు. ఇది బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది. జ్ట్టిఞ//ఛీజీజజీౌ్ట్చఛిజ్ఛుట.జౌఠి.వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తోంది.
ఎలా పొందాలి..
డిజిటల్ లాకర్ పొందాలనుకునే ప్రతి ఖాతాదారు ఈ వైబ్‌సైట్‌లోకి వెళ్లి ఒక యూజర్ నేమ్, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను యాడ్ చేయాలి. అప్పుడు ఖాతాదారుడికి 10 ఎంబీస్పేస్‌ను ఈ వెబ్‌సైట్ కేటాయిస్తుంది. సగటున 10 ఎంబీ స్పేస్‌లో దాదాపు 20కి పైగా స్కాన్ చేసిన సర్టిఫికెట్లను స్టోర్ చేయవచ్చు. వాటిని అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు. అలాగే స్కాన్ చేసిన ప్రతి సర్టిఫికెట్ డిజిటల్ కాపీ కూడా వెబ్‌సైట్‌లోనే తయారవుతుంది. దీనిలోనే డిజిటల్ సంతకాలు కూడా చేసుకునే వీలుంది. తద్వారా ఏ అవసరానికైనా సర్టిఫికెట్లు జిరాక్స్‌లు సమర్పించకుండా డిజిటల్ లాకర్‌లోకి వెళ్లి సర్టిఫికెట్‌కు ఉన్న లింకర్‌ను పంపితే చాలు. అది అక్కడ సర్టిఫికెట్ రూపంలో ప్రింట్ వస్తుంది. ముఖ్యంగా కళాశాల, పాఠశాలల విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. భవిషత్తులో సర్టిఫికెట్లు పొరపాటున పోయినా డిజిటల్ లాకర్‌లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ఎన్ని ప్రింట్లయినా తీసుకోవచ్చు.
ఇతర రాష్ట్రాల్లో బాగా వినియోగం
ఈ డిజిటల్ లాకర్ విధానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మినహాదాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 58,220 డిజిటల్ లాకర్లు ఉండగా వాటిలో 52,109 పత్రాలు స్టోర్ చేశారు. ముఖ్యంగా గుజరాత్‌లో 9494, ఉత్తరప్రదేశ్‌లో 8235, మహరాష్ట్రలో 6071 మంది దీనిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర రాజధాని కావడంతో దీనిని జిల్లాలో సీరియస్‌గా అములు చేయాలని కలెక్టర్ బాబు ఎ. నిర్ణయించారు. దీని పర్యవేక్షణ బాధ్యతను ఈ-ఆఫీసర్స్, నిట్ అధికారులు, ముఖ్య ప్రణాళికాధికారులకు అప్పగించారు. జిల్లావాసులంతా దీనిని వినియోగించేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు.
ధ్రువపత్రం.. బహు భద్రం
Published Fri, Mar 20 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM
Advertisement