పాస్‌పోర్టుల్లో పుట్టినతేదీ మార్పు ఇకపై సులభతరం కానుంది. పాస్‌పోర్టు నిబంధనలను కేంద్రం సరళీకృతం చేస్తోంది.
న్యూఢిల్లీ: పాస్‌పోర్టుల్లో పుట్టినతేదీ మార్పు ఇకపై సులభతరం కానుంది. పాస్‌పోర్టు నిబంధనలను కేంద్రం సరళీకృతం చేస్తోంది. ప్రస్తుతమున్న నిబంధనలను మారుస్తూ.. డిజిటల్ సంతకాలున్న పుట్టిన, వివాహ ధ్రువీకరణ పత్రాలకు ప్రమాణికంగా అంగీకరించింది. ఈమేరకు పాస్‌పోర్టు జారీ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది.
పాత పద్ధతిలో పుట్టినరోజు మార్చుకునేందుకు చాలా సమస్యలుండేవి. పాస్‌పోర్టు తీసుకున్న ఐదేళ్లలోపు మాత్రమే వీటిని మార్చుకోవాల్సి ఉండేది. ఇందుకు చాలా పేపర్ వర్క్ చేయాల్సి వచ్చేది. ఎక్కువ సమయం పట్టేది కూడా. తాజా నిబంధనల ప్రకారం.. ఆధార్, ఎన్నికల గుర్తింపు, పాన్, కేసులేమీ లేవనీ ధృవీకరణ పత్రం ఉంటే కొత్తగా పాస్‌పోర్టు పొందటం కూడా చాలా సులభతరమైంది.