నకిలీ డాక్టర్ గుట్టు రట్టు | district medical and health departmentattacks on fake doctors | Sakshi
Sakshi News home page

నకిలీ డాక్టర్ గుట్టు రట్టు

Published Thu, Dec 12 2013 3:41 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM

district medical and health departmentattacks on  fake doctors

వరంగల్, న్యూస్‌లైన్ :  ఎలాంటి విద్యార్హతలు లేకుండా రోగుల కు వైద్యం చేస్తున్న ఓ నకిలీ డాక్టర్‌ను వరంగల్ డీఎంహెచ్‌ఓ సాంబశివరావు బుధవారం పట్టుకున్నారు. అలాగే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుం చి ఎలాంటి అనుమతులు పొందకుండా నిర్వహిస్తున్న రెండు ప్రైవేట్ ఆస్పత్రులపై దా డులు నిర్వహించి వాటిని కూడా సీజ్ చేశారు. డీ ఎంహెచ్‌ఓ కథనం ప్రకారం.. తమిళనాడుకు చెందిన హసన్‌భూపతి హన్మకొండ కాకాజీకాలనీలో కొన్నేళ్ల క్రితం శ్రీసాయి ఆస్పత్రిని ఏ ర్పాటు చేసుకుని ఎండోక్రైనాలజీ డీఎంగా చెలామణి అవుతున్నాడు. అయితే హసన్‌భూపతి నకిలీ వైద్యుడని, ఆయనపై విచారణ చేపట్టాల ని ఐఎంఏ, అప్నా సంఘాలు ఇటీవల డీ ఎంహెచ్‌ఓకు ఫిర్యాదు చేశాయి.

దీంతో ఆయన బుధవారం ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేయగా హసన్‌భూపతి వద్ద డీఎం ఎండోక్రైనాలజీకి సంబంధించిన ఎలాంటి అర్హత సర్టిఫికెట్లు లభించకపోవడంతో అతడిని నకిలీ డాక్టర్‌గా గుర్తించినట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. అలాగే ఆస్పత్రికి కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో దానిని సీజ్ చేసినట్లు చెప్పారు. కాగా, ఇదే కాలనీలోని భవానీ ఆస్పత్రికి కూడా వైద్య ఆరోగ్యశాఖ నుంచి రిజిస్ట్రేషన్ లేకపోవడంతో దానిని కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. అనంతరం డీఎంహెచ్‌ఓ సాంబశివరావు విలేకరుల తో మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండా ఆస్పత్రులను నిర్వహిస్తున్నందుకు శ్రీసాయి, భవానీ ఆస్పత్రులను సీజ్‌చేసినట్లు చెప్పారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సర్టిఫికెట్ సృష్టించుకుని ఎండోక్రైనాలజీ డాక్టర్‌గా చెలామణి అవుతున్న హసన్‌భూపతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  ప్రజలను మోసం చేస్తూ నకిలీ వైద్యం చేసే వారిపై కఠిన చర్య లు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు విజయ్‌చందర్‌రెడ్డి, నాయకులు డాక్టర్ శేషుమాధవ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement