
బలవంతపు కాపురం కుదరదు: సురవరం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బిల్లును అడ్డుకోవాలనుకోవడం తగదని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సీమాంధ్ర నేతలకు సూచించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. విభజన ప్రక్రియ జరిగాక కలిసి ఉండడం అసాధ్యమని, బలవంతపు కాపురం కుదరదని అన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రావచ్చని అభిప్రాయపడ్డారు.
పంట నష్టాలపై అఖిల పక్షం: సీఎంకు నారాయణ లేఖ
తుపాన్లు, వర్షాలతో జరిగిన పంటనష్టాలపై చర్చకు అఖిలపక్షం ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఆయన మంగళవారం ఈ మేరకు ముఖ్యమంత్రికి లేఖ రాశారు.