సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ సర్పం చ్‌లు చెక్‌పవర్ బాధ్యతను జాగ్రత్తగా వినియోగించుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి సూచించారు. చెక్‌పవర్ పునరుద్ధరించినందుకు రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో సర్పంచ్‌లు సచివాలయంలో మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల కారణంగా కేంద్ర ప్రభుత్వం 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయకుండా ఆపేసిందని, పంచాయతీ ఎన్నికలు పూర్తయినందున రూ. 488 కోట్లు విడుదల చేసిందని వాటిని, జెడ్పీ, మండల, పంచాయతీలకు పంపిణీ చేసినట్లు వివరించారు. మరో వంద కోట్లు మంచినీటి పథకాల కోసం విడుదల చేసినట్లు తెలిపారు. పలు పార్టీలు, సర్పంచ్‌ల సంఘాలు, వివిధ సంఘాల విజ్ఞప్తి మేరకు సర్పంచ్‌లకు ఈ చెక్‌పవర్‌ను పునరుద్ధరించామన్నారు.
వెంటనే మండల, జెడ్పీ, మునిసిపాలిటీల ఎన్నికలు నిర్వహించాలి
తక్షణమే మండల, జెడ్పీ, మునిసిపాలిటీల ఎన్నికలు నిర్వహించాలని వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. బీసీలకు రాజ్యాధికారం రాకుండా నిరోధించడానికే ఎన్నికలు వాయిదా వేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. మంత్రికి సన్మానం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పక్షం రోజుల్లోగా కోర్టుకు వెళ్లడమేకాక, ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. సర్పంచ్‌ల గౌరవ వేతనాన్ని 20 వేల రూపాయలకు పెంచాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు.
చెక్‌పవర్‌ను దుర్వినియోగం చేయొద్దు: జానారెడ్డి
Published Sat, Nov 2 2013 4:56 AM | Last Updated on Sat, Sep 2 2017 12:12 AM
Advertisement