విజయవాడ, న్యూస్‌లైన్ : విజయవాడకు చెందిన ప్రముఖ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు, పుస్తక రచయిత డాక్టర్ టీఎస్ రావుకు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. ఈ మేరకు తనకు అప్రూవల్ లేఖ అందినట్లు ఆయన తెలిపారు. యువతరంలో చైతన్యం తెచ్చే విధంగా ‘యువతరానికి ఆత్మీయ లేఖ’ పేరుతో 70 అడుగుల పొడవైన లేఖను(పుస్తక రూపంలో 140 పేజీలు) రచించి ప్రదర్శించినట్లు తెలిపారు.
ఈ సుదీర్ఘమైన లేఖలో యువత నేర్చుకోవాల్సినవి, విడిచి పెట్టాల్సినవి, పాటించాల్సినవి, తీర్చిదిద్దుకోవాల్సినవి, సాధించాల్సినవి ఇలా నూటొక్క అంశాలను అయిదుగా విభజించి పొందుపరచి ప్రదర్శించానన్నారు. 16,500 పదాలతో వంద అంశాలతో, 101 ప్రముఖుల కొటేషన్లతో కూర్చి అందులో విశేషంగా మనం అనే మాటను 150 సార్లు, సమాజం అనే పదాన్ని 23 సార్లు, ప్రపంచం అనే పదాన్ని 13 సార్లు, పాజిటివ్ అనే పదాన్ని 21 సార్లు, సాధిద్దాం అనే పదాన్ని 20 సార్లు ఉపయోగించడాన్ని ఈ లేఖ ప్రత్యేకతగా గుర్తిస్తున్నట్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థానక అధ్యక్షులు డాక్టర్ చింతపట్ల వెంకటాచారి తనకు పంపిన లేఖలో పేర్కొన్నారని రావు చెప్పారు.
రెండున్నర దశాబ్ధాలుగా కౌన్సిలింగ్ రంగంలో విశేష సేవలందిస్తుండగా, ఒకభాషకు సంబంధించి ప్రపంచ రికార్డ్స్ సంస్థగా ఆవిర్భవించిన తెలుగు బుక్ ఆఫ్ రిక్డార్డ్స్‌లో తన లేఖ నమోదు కావడం సంతోషంగా ఉందని డాక్టర్ టీఎస్ రావు ఆనందం వ్యక్తం చేశారు.
డాక్టర్ టీఎస్ రావ్‌కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
Published Tue, Jun 3 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 8:13 AM
Advertisement
Advertisement