సాక్షి, అనంతపురం : అనంతపురంలోని రవాణాశాఖ అధికారుల నిర్వాకం కారణంగా ఒక్కో వాహనదారుడి నుంచి అధికారులు రూ. 50 వేలు అదనంగా వసూలు చేస్తున్నారు. పరీక్షలు నిర్వహించకుండానే లెర్నింగ్ లైసెన్స్‌లు జారీ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. గడిచిన మూడు నెలల కాలంగా 30 వేలకు పైగా అక్రమ లైసెన్స్‌లు జారీ చేసినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేల కనుసన్నుల్లో ఎల్‌ఎల్‌ఆర్ మేళాను నిర్వహిస్తున్నారు.
అధికారుల అవినీతి కారణంగా ఇప్పటి వరకు 15 లక్షల రూపాయాలు చేతులు మారినట్లు సమాచారం. రవాణాశాఖ ఇష్టారాజ్యం వల్ల రోడ్డు భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. అనర్హులకు లైసెన్స్ మంజూరు చేయడం మూలంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవాణా శాఖ అధికారుల అవినీతి తారాస్థాయికి పెరుగుతున్నా దీనిపై స్పందించడానికి జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషన్ సుందర్ నిరాకరించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment