మా వాళ్లే.. కాస్త చూడండి | DSP transfers in West Godavari District | Sakshi
Sakshi News home page

మా వాళ్లే.. కాస్త చూడండి

Published Sat, Aug 16 2014 10:29 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

మా వాళ్లే.. కాస్త చూడండి - Sakshi

మా వాళ్లే.. కాస్త చూడండి

ఏలూరు : రాష్ర్టంలోని డీఎస్పీలందరికీ స్థానభ్రంశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో మన జిల్లాలోనూ పోలీసు అధికారుల బది‘లీలలు’ ఊపందుకున్నాయి. తమకు అనుకూలంగా ఉండే అధికారులను తీసుకువచ్చేం దుకు ఆయా పోలీస్ సబ్‌డివిజన్ల పరిధిలోని ప్రజాప్రతినిధులు శక్తివంచన లేకుండా యత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర హోంమంత్రికి, డీజీపీకి పలువురు ప్రజాప్రతినిధులు సిఫార్సు లేఖలు కూడా రాసినట్టు తెలుస్తోంది.
 
 ఏలూరు డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.సత్తిబాబు స్థానంలో విజయనగరం జిల్లా బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహమ్మద్‌ను తీసుకురావాలని ఇద్దరు ఎమ్మెల్యేలు యత్నిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సిఫార్సు లేఖను కూడా డీజీపీకి పంపించినట్టు తెలిసింది. సత్తిబాబు జంగారెడ్డిగూడెం డీఎస్పీగా రావాలని, వీలుకాని పక్షంలో కృష్ణాజిల్లా నూజివీడుకు వెళ్లాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన జిల్లాకు చెందిన ఓ మంత్రితో గట్టిగానే సిఫార్సు చేయించారని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ పరిధిలో పనిచేస్తున్న వెంకటరెడ్డిని నరసాపురం డీఎస్పీగా తీసుకువచ్చేందుకు ఆ ప్రాంత ప్రజాప్రతినిధి ఒకరు సిఫార్సు లేఖను డీజీపీకి పంపినట్టు తెలుస్తోంది.
 
 వాస్తవానికి తనకు బంధుత్వం ఉన్న ఓ కాంగ్రెస్ సీనియర్ నేత సూచన మేరకే ఆ ప్రజాప్రతినిధి ఈ మేరకు సిఫార్సు చేసినట్టు చెబుతున్నారు. కొవ్వూరు డీఎస్పీగా ప్రస్తుతం లూప్‌లైన్‌లో ఉన్న నర్రా వెంకటేశ్వరరావును బదిలీ చేయాలని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రజాప్రతినిధి గట్టిగా పట్టుబడుతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం పెద్దాపురం డీఎస్పీగా పనిచేస్తున్న ఓలేటి అరవిందబాబు కొవ్వూరు వచ్చేందుకు తీవ్రంగా యత్నిస్తున్నట్టు తెలిసింది.
 
 ఈ మేరకు ఆ ప్రాంత నేతలతో గట్టిగానే పైరవీలు చేస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద ఓ వారంలోగా డీఎస్పీల బదిలీ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోండటంతో పైరవీలు జోరందుకున్నారుు. ఇదిలావుండగా, ప్రజాప్రతినిధులతోపాటు పోలీసు ఉన్నతాధికారులతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఏలూరు నగరానికి చెందిన ఓ అధ్యాపకుడితో కూడా సదరు అధికారులు పైరవీలు చేయిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement