విజయవాడ టౌన్ : విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ప్రధాన అర్చకులు లింగంభట్ల చంద్రశేఖర్ శర్మ(65) మృతి చెందారు. శనివారం అర్ధరాత్రి విజయవాడ నగరంలోని బ్రహ్మణ వీధిలో ఉన్న ఇంట్లో తుది శ్వాస విడిచారు. చంద్రశేఖర్ శర్మ వంశపారం పర్యంగా ఆలయంలో ప్రధాన అర్చకులుగా పని చేస్తున్నారు. కాగా చంద్రశేఖర్ శర్మ మృతికి ఆలయ ఈవో చిననర్సింగరావు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం విజయవాడలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.