ఎంసెట్ ఫలితాల విడుదల | EAMCET results released | Sakshi
Sakshi News home page

ఎంసెట్ ఫలితాల విడుదల

Published Mon, Jun 9 2014 6:08 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM

ఎంసెట్ ఫలితాల విడుదల

ఎంసెట్ ఫలితాల విడుదల

ఎంసెట్ ఫలితాలను తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సాయంత్రం ఇక్కడ విడుదల చేశారు.

హైదరాబాద్: ఎంసెట్ ఫలితాలను తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈ సాయంత్రం ఇక్కడ విడుదల చేశారు. ఎస్ఎంఎస్ల ద్వారా విద్యార్థులకు ర్యాంకుల వివరాలు పంపుతున్నట్లు మంత్రి తెలిపారు.  ఇంజనీరింగ్ విభాగంలో   పవన్ కుమార్ మొదటి ర్యాంక్ సాధించాడు. ఈ నెల 14 నుంచి మార్కుల జాబితా విడుదల చేస్తారు.

ఎంసెట్‌లో 70.77 శాతం ఉత్తీర్ణత సాధించారు.  ఇంజనీరింగ్ విభాగంలో 70.78 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, అగ్రికల్చర్,మెడిసిన్ విభాగంలో 83.16 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపిలో ఇంజినీరింగ్ విభాగంలో 72.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, తెలంగాణలో 68.86 మంది ఉత్తీర్ణత సాధించారు. ఏపీ అగ్రికల్చర్, మెడికల్‌లో 86.21 శాతం ఉత్తీర్ణత సాధించగా, తెలంగాణ అగ్రికల్చర్, మెడికల్‌లో 80.98 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇంజనీరింగ్ మొదటి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులు:
 ఫస్ట్ ర్యాంక్ - పవన్ కుమార్ - హైదరాబాద్
 సెకండ్ ర్యాంక్  - చాణక్యవర్ధన్‌రెడ్డి - హైదరాబాద్
మూడో ర్యాంక్ - నిఖిల్‌కుమార్
 నాలుగో ర్యాంక్  - దివాకర్‌రెడ్డి
 ఐదో ర్యాంక్  - ఆదిత్యవర్ధన్

మెడిసిన్ తొలి 10 ర్యాంకులు సాధించిన విద్యార్థులు:
మొదటి ర్యాంక్ - గుర్రం సాయి శ్రీనివాసులు - మార్కాపురం
రెండవ ర్యాంక్ - డి.దివ్య - సూళ్లూరుపేట
మూడవ ర్యాంక్ - కందికొండ పృధ్వీరాజ్ - హైదరాబాద్
4వ ర్యాంక్ - దారవనేని హరిత - గుంటూరు
5వ ర్యాంక్ - ఉరుబండి మనోజ్ఞిత - విజయవాడ
6వ ర్యాంక్ - తేగు భరత్‌కుమార్ - ఖమ్మం
7వ ర్యాంక్ - పట్టినపు శ్రీదివ్య  - విశాఖ
8వ ర్యాంక్ - సాత్విక్ గంగిరెడ్డి - హైదరాబాద్
9వ ర్యాంక్ - రాయల సాయి హర్షతేజ - ఖమ్మం
10వ ర్యాంక్  - గంటా సాయి నిఖిల - తెనాలి


ఈ నెల 15 నుంచి మెడికల్ కౌన్సిలింగ్,  29 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.  రేపు సాయంత్రం నుంచి వెబ్సైట్లో ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఫలితాల విడుదల సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇరు రాష్ట్రాలలో ఎవరి వ్యవహారాలు వారు చూసుకునేలా ప్రయత్నిస్తామన్నారు. రెండు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు చర్చించుకుంటామని చెప్పారు.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement