ప్రకాశం జిల్లా మేదరమెట్లలో బుధవారం ఉదయం 10.45 గంటల సమయంలో భూమి స్వల్పంగా కొద్దిసేపు కంపించింది.
ప్రకాశం జిల్లా మేదరమెట్లలో బుధవారం ఉదయం 10.45 గంటల సమయంలో భూమి కంపించింది. ఉరుములు, పిడుగులు పడటంతో పాటు ఒకేసారి భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలోని టేబుళ్లు, కుర్చీలు కూడా కదిలినట్లు అనిపించడంతో ఇళ్లలోని వారు భయపడ్డారు.
అప్పటికే పిల్లలు స్కూళ్లకు వెళ్లిపోవడంతో కొంతవరకు ముప్పు తప్పింది. రెండు విడతలుగా రెండేసి సెకన్ల పాటు భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆనుకుని అల్పపీడనం కూడా ఉండటంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారీగా ఉరుములు, పిడుగులు పడటంతో పాటు భూకంపం కూడా రావడంతో ప్రకాశం జిల్లా వాసులు భయపడుతున్నారు.