సాక్షి,విజయవాడ : విద్యాశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలపై ఎక్స్‌పర్ట్ కమిటీ శనివారం మేధావులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యాశాఖలో ఎటువంటి మార్పులు తెస్తే బాగుంటుదన్న అంశాలపై వివిధ సంఘాల ప్రతినిధులు కమిటీ సభ్యుల దృష్టికి తీసుకొచ్చారు. విద్యాశాఖ నిపుణుల కమిటీ సభ్యుడు వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగంలో సమూలమైన మార్పులు తేవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నారని పేర్కొన్నారు.
దీనికి సంబంధించి త్వరలోనే క్షేత్ర స్థాయిలో పర్యటన నిర్వహించి వివిధ పాఠశాలల స్థితిగతులపై నాలుగు నెలల్లో నివేదికను తయారు చేసి జగన్‌కు అందజేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో కామన్ విద్యా విధానంతో పాటు, మౌళిక సదుపాయాలకు పెద్దపీఠ వేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నిరక్షరాస్యత లేని ఆంధ్రప్రదేశ్‌ను చూడడమే ముఖ్యమంత్రి ధ్యేయమని వెంకట్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment