వేసవిలో తాగునీటికి కొరత లేకుండా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ అధికారులను ఆదేశించారు.
పార్వతీపురం: వేసవిలో తాగునీటికి కొరత లేకుండా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎం.ఎం.నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం పార్వతీపురం ఐటీడీఏ కార్యాలయంలో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా గిరిజన సంక్షేమ శాఖ ఈఈ ఎ.వి.సుబ్బారావుతో మాట్లాడుతూ నీటి కొరత ఉన్న గిరిజన గ్రామాలను ఎంపిక చేయాలని సూచించారు. నివేదిక మేరకు ఆయా గ్రామాల్లో కొత్తగా బోర్లు వేయించాలని ఆదేశించారు. అసంపూర్తిగా ఉన్న రక్షిత పథకాల నిర్మాణాలను నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మినీ ట్రాక్టర్లు, విత్తనాలకు సంబంధించిన అంశాలపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆశ్రమ పాఠశాలలకు అదనపు తరగతి గదులు ఎన్ని అవసరమో నివేదికను తయారు చేసి పంపించాలని ఐటీడీఏ డీడీ విజయ కుమార్‌ను ఆదేశించారు. అంతర పంటల సాగు ఆవశ్యకతను ప్రజలను వివరించాలని ఉద్యానవన శాఖాధికారులకు సూచించారు. సీసీ రోడ్లు లేని గ్రామాల వివరాలు సేకరించి నివేదిక పంపించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీకేశ్ బి లఠ్కర్, ఆర్‌డీఓ రోణ ంకి గోవిందరావు, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు, వ్యవసాయ జేడీ, పీఆర్ ఈఈ, ఆర్‌అండ్ బీఈఈ, ఇరిగేషన్ డీఈ తదితరులు పాల్గొన్నారు.