విభజనతో సంబంధం లేకుండా ఎన్నికలు: భన్వర్ లాల్
రాష్ట్రం ఒకటిగా ఉన్నా.. రెండుగా విడిపోయినా ఎన్నికలు యధాతథంగా జరుగుతాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ అన్నారు. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని ఆయన తెలిపారు.
జనవరి 25 తేదిన జాతీయ జాతీయ ఓటర్ల దినోత్సవాన్నినిర్వహిస్తున్నామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆయా పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు నమోదు అయిందో లేదో తెలుసుకునే అవకాశం ఉంది ఆయన తెలిపారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 6 కోట్ల 24లక్షల 6వేల 81 మంది అని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50లక్షల పదివేల 24 మంది ఓటర్లు ఉన్నారని.. విజయనగరంలో అత్యల్పంగా 16లక్షల 86వేల 174 మంది ఓటర్లు ఉన్నారని భన్వర్ లాల్ తెలిపారు.