కడప, సాక్షి : ఉపాధి హామీ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీల్లో వెల్లడైన అవినీతి సొమ్మును కక్కించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇంందులో భాగంగా జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, డివిజన్ స్థాయిలో ఆర్డీఓల ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీలు వేసి సొమ్ము రికవరీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. గతంలో కలెక్టర్ అనిల్‌కుమార్ ఈ కమిటీలకు శ్రీకారం చుట్టినప్పటికీ బదిలీ నేపథ్యంలో కమిటీల ప్రక్రియ ఆగిపోయింది..
ప్రస్తుత కలెక్టర్ కోన శశిధర్ మళ్లీ ఆ కమిటీలను తెరపైకి తెచ్చి ఉపాధిలో స్వాహా అయిన సొమ్మును రాబట్టేందుకు చర్యలు చేపట్టారు. బాధ్యులైన వారిపై పోలీసుస్టేషన్లలో కేసు నమోదుతోపాటు ఆర్‌ఆర్ యాక్టు కింద సొమ్మును కచ్చితంగా రాబట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈనెల 20వ తేదీలోగా కమిటీల సమావేశాన్ని నిర్వహించాలని డ్వామా పీడీ బాలసుబ్రమణ్యంకు ఆదేశాలు జారీ చేశారు.
కమిటీ స్వరూపమిదే!
జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో సభ్యులుగా ఎస్పీ, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ, కన్వీనర్‌గా జిల్లా విజిలెన్స్ అధికారి వ్యవహరిస్తారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓ చైర్మన్‌గా, సభ్యులుగా డీఎస్పీ, తహశీల్దార్, కన్వీనర్‌గా ఏపీడీ వ్యవహరించనున్నారు.
దీంతోపాటు ఇతర శాఖల అధికారులు, సర్పంచులు మొత్తం కలిపి రూ. 1,21,57,604. అంటే మొత్తం జిల్లా వ్యాప్తంగా రూ. 2,78,93,440 సొమ్మును ఇంకా రికవరీ చేయాల్సి ఉంది.
అవినీతిలో భాగస్వాములు వీరే!
జిల్లాలో ఇప్పటివరకు ఆరు విడతల సామాజిక తనిఖీలు పూర్తి కావడంతోపాటు ఏడవ విడతలో కూడా 30 మండలాల్లో సామాజిక తనిఖీలు ఇప్పటికే జరిగాయి. ఇందులో అవినీతికి పాల్పడిన వారుగా ఎఫ్‌ఏలు 894, టీఏలు 334, సీఓలు 72, ఏపీఓలు 16, బీపీఎంలు 485, ఎంపీడీఓలు 7, ఏఈలు 4, ఈసీలు 41, సర్పంచులు 43, మేట్లు 1087, ఇతరులు 868 కలిపి మొత్తం 3861మందిని గుర్తించారు. వీరిలో కూడా రూ. 50 వేల కంటే ఎక్కువ అవినీతికి పాల్పడిన వారిని ఎ కేటగిరి కింద, రూ. 50 వేల కంటే తక్కువ అవినీతికి పాల్పడిన వారిని బి కేటగిరి, ప్రొసిజర్‌లో తప్పులు చేసిన వారిని సి కేటగిరిగా పరిగణించారు.
ఎ కేటగిరిలో ఎఫ్‌ఏలు 10 మంది, టీఏలు 56, సీఓలు 3, ఏపీఓలు 2, బీపీఎంలు 5, ఎంపీడీఓలు 4, ఏఈలు 1, ఈసీలు 4, సర్పంచులు 14, మేట్లు 12, ఇతరులు 49 మంది కలిపి మొత్తం 240 మంది ఉన్నారు. బి కేటగిరిలో ఎఫ్‌ఏలో 804, టీఏలు 288, సీఓలు 69, ఏపీఓలు 14, బీపీఎంలు 480, ఎంపీడీఓలు 3, ఏఈలు 3, ఈసీలు 37, సర్పంచులు 29, మేట్లు 1075, ఇతరులు 819 కలిపి మొత్తం 3,621 మంది ఉన్నారు. సి కేటగిరిలో ఎఫ్‌ఏలు 111, టీఏలు 10, సీఓలు 8, ఏపీఓలు 11, ఎంపీడీఓలు 3, ఈసీలు 3 మొత్తం 146 మంది ఉన్నారు. మొత్తం మీద వీరిపైన ఇప్పటివరకు సొమ్ము రాబట్టడంలో నామమాత్రపు చర్యలు మాత్రమే తీసుకున్నారు. దీనికితోడు శాఖాపరంగా కూడా ప్రత్యేకంగా చర్యలు లేకపోవడంతో వీరిలో ఇంతవరకు చలనం లేదు. ప్రస్తుతం కమిటీలు ఆర్‌ఆర్ యాక్టు, పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు నేపథ్యంలో అవినీతికి పాల్పడిన వారు బెంబేలెత్తుతున్నారు.
త్వరలో కమిటీ సమావేశాలు
జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ లోపల కమిటీ సమావేశాలను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సొమ్ము రికవరీకి సంబంధించి కమిటీ రూపొందించుకుని బాధ్యుల నుంచి సొమ్ము రికవరీ చేయడం, లేకపోతే వారిపై చర్యలు తీసుకునేందుకు కసరత్తు చేస్తున్నాం. ఆర్‌ఆర్ యాక్టుతోపాటు పోలీసుస్టేషన్‌లో బాధ్యులపై ఫిర్యాదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- బాలసుబ్రమణ్యం, డ్వామా పీడీ, కడప
సొమ్ము కక్కాల్సిందే!
Published Tue, Dec 17 2013 6:01 AM | Last Updated on Sat, Sep 22 2018 8:25 PM
Advertisement
Advertisement