ప్రశాంతంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ | engineering completedl successfully | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

Published Sat, Aug 24 2013 4:23 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

engineering completedl successfully

 ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: ఒంగోలు నగరంలోని రెండు ఎంసెట్-2013 హెల్ప్‌లైన్ సెంటర్లలో ఇంజినీరింగ్, ఫార్మసీ కౌన్సెలింగ్ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. రెండు సెంటర్లలో మొత్తం 466 మంది విద్యార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకుని, సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. స్థానిక డీఎస్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలోని హెల్ప్‌లైన్ సెంటర్‌కు 60001 ర్యాంకు నుంచి 70000 ర్యాంకు వరకు 241 మంది విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరైనట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్యలక్ష్మి తెలిపారు. శనివారం తమ కళాశాలలో 80001 ర్యాంకు నుంచి 90000 ర్యాంకు వరకు విద్యార్థులు హాజరుకావాలని ఆమె తెలిపారు. అదే విధంగా కౌన్సెలింగ్ ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లో మిగిలిపోయిన అభ్యర్థులు కూడా శనివారం కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చని చెప్పారు. స్థానిక ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పీజీ సెంటర్‌లోని ఎంసెట్ హెల్ప్‌లైన్ సెంటర్‌కు 70,001 నుంచి 80,000 ర్యాంకు వరకు 225 మంది విద్యార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేయించుకుని సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనట్లు పీజీ సెంటర్ స్పెషలాఫీసర్ డాక్టర్ జి. రాజమోహనరావు తెలిపారు.
 
 నేడు పీజీ సెంటర్ బంద్
 రాష్ట్ర విభజనను నిరసిస్తూ సమైక్యాంధ్రకు మద్దతుగా శనివారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని యూనివర్సిటీ, పీజీ సెంటర్లు, పీజీ కళాశాలలు మూసివేసి బంద్ పాటించనున్నట్లు స్పెషలాఫీసర్ డాక్టర్ రాజమోహనరావు తెలిపారు.  ఒంగోలులోని పీజీ సెంటర్ సిబ్బంది అందరూ బంద్‌లో పాల్గొంటున్నట్లు చెప్పారు. బంద్ వల్ల పీజీ సెంటర్లో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ నిలిచిపోనుంది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖకు తెలియజేసినట్లు ఆయన చెప్పారు. ఆదివారం ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ యథావిధిగా జరుగుతుంది. ఆదివారం కౌన్సెలింగ్‌కు శనివారం కౌన్సెలింగ్‌కు కేటాయించిన ర్యాంకుల అభ్యర్థులు కూడా హాజరుకావచ్చునని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement