ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద శనివారం సముద్రంలో మునిగి ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. కాకినాడలోని ఆదిత్య, కైట్ ఇంజినీరింగ్ కళాశాలలకు చెందిన 29 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఏపీ టూరిజం బోట్‌లో హోప్‌ఐలాండ్‌కు విహార యాత్రకు వెళ్లారు.
అక్కడ ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు విద్యార్థులు ఊబిలో కూరుకుపోగా ఒకరిని తోటి విద్యార్థులు రక్షించారు. మరో విద్యార్థి ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. మృతి చెందిన విద్యార్థి కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం వాసి దంగేటి సూరిబాబు కుమారుడు వెంకట సుధీర్(20)గా గుర్తించారు. ఇతడు బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు.