'జిల్లా అభివృద్ది చేస్తానని బాబు హామీ ఇచ్చారు' | equal develop of all districts, says Sidda Raghavarao | Sakshi
Sakshi News home page

'జిల్లా అభివృద్ది చేస్తానని బాబు హామీ ఇచ్చారు'

Published Sun, Aug 17 2014 2:07 PM | Last Updated on Mon, Aug 20 2018 3:26 PM

'జిల్లా అభివృద్ది చేస్తానని బాబు హామీ ఇచ్చారు' - Sakshi

'జిల్లా అభివృద్ది చేస్తానని బాబు హామీ ఇచ్చారు'

ఆర్టీసీకి రోజకు 2.70 కోట్ల నష్టం వస్తుందని ఆంధ్రప్రదేశ్ రవాణ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. నష్టాలను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడుతూ... త్వరలో ఆర్టీసీలో కొత్త బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. ఆర్టీసీలో ఇంధన పొదుపుపై దృష్టి సారించినట్లు వివరించారు.

నవ్యాంధ్రలో మొత్తం 13 జిల్లాలను సమాన ప్రాతిపదిక అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. విజయవాడ - గుంటూరు నగరాల మధ్యే రాజధాని నిర్మాణానికి అవకాశాలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో ఎయిర్పోర్ట్, రామాయపట్నం పోర్టుతోపాటు దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ది చేస్తానని సీఎం చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని శిద్దా రాఘవరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement