సమ్మె కొనసాగిస్తే ఎస్మా ప్రయోగిస్తాం | AP Transport minister sidda raghavarao warning to RTC employees | Sakshi
Sakshi News home page

సమ్మె కొనసాగిస్తే ఎస్మా ప్రయోగిస్తాం

Published Wed, May 6 2015 7:01 PM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM

AP Transport minister sidda raghavarao warning to RTC employees

ఒంగోలు: సమ్మె కొనసాగిస్తే ఎస్మా ప్రయోగిస్తామని ఆర్టీసీ కార్మికులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు హెచ్చరించారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ బస్సులపై సంస్థ కార్మికులు దాడి చేస్తే ఆరెస్ట్ చేస్తామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టీసీ డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి.

అయితే దినసరి వేతనం ఇచ్చే ఒప్పందంపై వచ్చిన డ్రైవర్, కండక్టర్లతో బస్సులు నడపాలని నిశ్చయించారు.  అందులోభాగంగా డిపోల నుంచి బస్సులు వెలుపలకు తీసుకు రాగా ఆర్టీసీ కార్మికులు బస్సులపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి శిద్ధా రాఘవరావుపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement