సకాలంలో సేవలందించకపోతే జరిమానా! | ERC order ielectrical problems of penalties to be paid in right time | Sakshi
Sakshi News home page

సకాలంలో సేవలందించకపోతే జరిమానా!

Published Fri, Aug 9 2013 5:13 AM | Last Updated on Tue, Sep 18 2018 8:41 PM

ERC order  ielectrical problems of penalties to be paid in right time

విద్యుత్ సమస్యల పెనాల్టీలు పెంచుతూ ఈఆర్‌సీ ఆదేశాలు
 సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుని రుసుములన్నీ చెల్లించి 30 రోజులు దాటినప్పటికీ కనెక్షన్ ఇవ్వకపోయినా, గ్రామంలో ట్రాన్స్‌ఫార్మర్ పాడైందని ఫిర్యాదు చేసి 48 గంటలు దాటినప్పటికీ మార్చకపోయినా విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల అధికారులు ఇకపై అధికంగా జరిమానాలు చెల్లించాల్సిందే.
 
 ఈ మేరకు ఇప్పటికే ఉన్న పనితీరు ప్రమాణాల (స్టాండర్డ్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్-ఎస్‌వోపీ) విధానంలో  మార్పులు చేస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) గురువారం ఆదేశాలు జారీచేసింది. సకాలంలో సేవలు అందించకపోతే ఈ విషయాన్ని సంబంధిత పై అధికారులకు తెలిపి నష్టపరిహారాన్ని పొందవచ్చునని ఈఆర్‌సీ పేర్కొంది. నష్టపరిహారం అందకపోతే వినియోగదారుల పరిష్కారాల ఫోరంను ఆశ్రయించాలని సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement