కడప అర్బన్, న్యూస్‌లైన్ :ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు ఎంపికైన 78 మంది అభ్యర్థుల జాబితాను ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ టి.నాగలక్ష్మి సోమవారం సాయంత్రం కడప ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ప్రకటించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల నోటిఫికేషన్‌ను 2012 అక్టోబరు 30న విడుదల చేశారన్నారు. 2012 డిసెంబరు 1 నుంచి 19వ తేది వరకు దాదాపు 15 వేల మందికి నాలుగు కిలోమీటర్ల పరుగుపందెన్ని నిర్వహించామన్నారు.
2013 జనవరి 17 నుంచి ఫిబ్రవరి 5 వరకు దేహదారుడ్య పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన చేశామన్నారు. ఈ పరీక్షల్లో ఎంపికైన 2005 మంది అదే సంవత్సరం మార్చి 31న రాత పరీక్ష రాశారన్నారు. రాత పరీక్షలో ఎంపికైన 1:2 అభ్యర్థుల జాబితాను డిస్ట్రిక్ సెలెక్షన్ కమిటీ ఆద్వర్యంలో ఎంపిక చేశామన్నారు. జిల్లాలో 80 పోస్టులకుగాను అర్హత పొందిన 78 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ శంభుప్రసాద్, కడప ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్, జమ్మలమడుగు ఎక్సైజ్ సీఐ పీరుసాహెబ్, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
మెరిట్ అభ్యర్థుల వివరాలు
ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం బరిలో దిగిన అభ్యర్థులలో మొదటి ర్యాంకును మడితాటి పద్మాకర్‌రెడ్డి (86 మార్కులు), ద్వితీయ ర్యాంకును జి.ఈశ్వరయ్య (85 మార్కులు), తృతీయ ర్యాంకును జి.శంకరయ్య (83 మార్కులు), బి.శ్రీనివాసులురెడ్డి (83 మార్కులు), సి.విష్ణువర్దన్‌రెడ్డి (83 మార్కులు) ఉన్నారు.