కృష్ణా జిల్లా కలిదిండిలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు.
విజయవాడ: కృష్ణా జిల్లా కలిదిండిలో నకిలీ నోట్ల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2 లక్షలా 28 వేల రూపాయిలు నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. పేపర్ కట్టర్, కంప్యూటర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
హౌరా నుంచి వీటిని తీసుకువచ్చినట్టు నిందితులు అంగీకరించారని పోలీసులు తెలిపారు. లక్ష నకిలీ నోట్లకు 50 వేల రూపాయిలు ఇచ్చి మార్పిడి చేసుకున్నట్టు వెల్లడించారు. ముదినేపల్లి టీడీపీ జెడ్సీటీసీ నాగకల్యాణి భర్త రవీంద్రబాబుకు 15 లక్షల నకిలీ నోట్లను ఇచ్చామని నిందితులు తెలిపారు.