ఎల్లారెడ్డిపేట, న్యూస్‌లైన్: బ్యాంకు అభివృద్ధికి పాటుపడాల్సిన మేనేజర్ ఓ రైతు పేరుతో రుణం తీసుకొని మోసం చేసిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మండలంలోని రైతులు, ఖాతాదారుల్లో కలకలం సృష్టించింది. స్థానిక ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకులో 2009లో మేనేజర్‌గా పనిచేసిన ఎడ్ల శ్రీనివాసరెడ్డి మరో వ్యక్తి కొండల్‌రెడ్డితో కలిసి మండలంలోని అక్కపల్లికి చెందిన శ్రీనివాస్‌రెడ్డి పేరుపై రూ.50వేల రుణం ఫోర్జరీ సంతకంతో కాజేశారు. ఈ విషయం ఇప్పటివరకు గోప్యంగా ఉం డగా శుక్రవారం రుణం చెల్లించాలని బాధితుడు శ్రీనివాసరెడ్డికి బ్యాంకు నుంచి నోటిసు వచ్చింది.
బిత్తరపోయిన ఆయన శనివా రం బ్యాంకుకు వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడిం ది. శ్రీనివాస్‌రెడ్డి హైదరాబాద్‌కు బదిలీ అయ్యారు. ఆయన హ యాంలో ఇలాంటి అక్రమాలు అనేకం జరిగినట్లు పలువురు పే ర్కొంటున్నారు. బాధిత రైతు శ్రీనివాస్‌రెడ్డి బ్యాంకు ఎదుట ఏకం గా ఆందోళనకు దిగాడు. తన పేరుతో రుణం తీసుకున్న అప్పటి మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ విషయమై ప్రస్తుత మేనేజర్ రమేశ్‌బాబు ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
రైతు పేరుతో బ్యాంకు మేనేజర్ రుణం
Published Sun, Sep 22 2013 4:46 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement