కర్నూలు జిల్లాలో యువరైతు ఆత్మహత్య
Published Wed, Nov 25 2015 1:00 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
ఆలూరు: అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య చేసుకున్నసంఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ఆలూరు మండలం మలగవెల్లిలో బుధవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గురుస్వామి(33) తనకున్న 20 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో బెంగాలిగ్రామ్(పసుపు శెనగ) పంట సాగు కోసం పలు బ్యాంకులతో పాటు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల వద్ద నుంచి సుమారు రూ. 6 లక్షల నగదును అప్పుగా తీసుకున్నాడు. కాగా.. పంట దిగుబడి సరిగ్గా లేకపోవడంతో అప్పులు తీర్చే దారి కానరాక మనస్తాపానికి గురై ఇంట్లో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గుర్తించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించే లోపే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement