
మృతి చెందిన నరేష్‌కుమార్
నంద్యాల: అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాలూకా ఎస్‌ఐ రమేష్‌బాబు వివరాల మేరకు..పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌కు చెందిన నరేష్‌కుమార్(29) సుధన అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె నంద్యాలలోని విద్యుత్ కార్యాలయంలో ఏఈగా పని చేస్తోంది. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. నరేష్‌కుమార్ తెలిసిన వారి వద్ద దాదాపు రూ.35 లక్షల దాకా అప్పు చేశాడు.
ఇటీవల అప్పులిచ్చిన వారు అతడిపై ఒత్తిడి తేవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. మంగళవారం ఉదయం పొన్నాపురం వద్ద ఉన్న జాతీయ రహదారి పక్కన పురుగుల మందు తాగి భార్యకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న బంధువులు కొన ఊపిరితో ఉన్న అతడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో మృతి చెందాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తాలూకా ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment