గుండెపోటుతో రైతు మృతి | Farmer died with heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో రైతు మృతి

Published Sun, Oct 27 2013 3:35 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

Farmer died with heart attack

 చోడవరం టౌన్ : వరి పంట ముంపునకు గురవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురయి మండలంలోని లక్ష్మీపురానికి చెందిన రైతు గుండెపోటుతో శని వారం మృతి చెందాడు. భారీ వర్షాలకు గ్రామంలోని పంట భూములన్నీ నీటమునిగాయి. గ్రామానికి చెందిన మహాదేవ స్వామినాయుడు (45)ఉదయాన్నే పొలానికి వెళ్లాడు. నీటమునిగిన వరిపంటను చూసి కలత చెందా డు. గతేడాదీ అప్పులపాలయ్యానని, ఈ  ఏడాది పెద్ద మొత్తంలో మదుపులు పెట్టి వరిపంట చేపట్టినప్పటికీ ఫలితం దక్కకుండాపోతోందంటూ తోటి రైతుల వద్ద వాపోయాడు. గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతిచెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement