రైతు రుణమాఫీలో ఏపీ ప్రభుత్వం మరో మెలిక
సాక్షి, హైదరాబాద్: ఇప్పటికీ ఒక్క రైతుకు చెందిన రుణాలు ఒక్క పైసా కూడా మాఫీ చేయని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ మరో మెలిక పెడుతోంది. రేషన్ కార్డు లేదంటే కుదరదని, ఓటర్ గుర్తింపు కార్డు తీసుకురావాలనే నిబంధన పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికా శాఖ ఉపాధ్యక్షుడు కుటుంబరావు వీడియో కాన్ఫరెన్స్ లో బ్యాంకులకు, జిల్లా కలెక్టర్లకు స్పష్టం చేశారు. రేషన్ కార్డు ద్వారా ఆ కుటుంబంలో రుణాలు తీసుకున్న వారందరినీ యూనిట్ గా పరిగణనలోకి తీసుకోవాలన్నది ప్రభుత్వ నిర్ణయం.
అయితే 16.16 లక్షల మంది రైతుల ఖాతాలకు ఆధార్, రేషన్ కార్డులు లేవని తేలింది. మరోవైపు రేషన్ కార్డు లేని రైతులు ఏ కుటుంబానికి చెందినవారో కనుగొనేం దుకు కొత్తగా ఓటర్ గుర్తింపు కార్డు తీసుకురావాలనే మెలిక పెట్టాలని నిర్ణయించింది. మరో 5.58 లక్షల రైతుల ఆధార్ నెంబర్లను స్టేట్ రిసిడెంట్ డేటా హబ్ తిరస్కరించింది. వీరంతా రుణ మాఫీ పరిధిలోకి రాకుండా తొలగిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి.
ఆధార్ ఉన్నప్పటికీ రేషన్ కార్డులు లేని రైతుల ఖాతాలు 6.76 లక్షలుగా తేలా యి. ఓటర్ కార్డుతో ఈ రైతులు ఏ ఏ కుటుం బాలకు చెందిన వారో గ్రామాల్లో తనిఖీలు ద్వారా తెలుసుకోవడమా లేదా రుణ మాఫీ అర్హత నుంచి దూరం పెట్టడమా అనే అం శంపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవా ల్సి ఉందని అధికార వర్గాలు తెలిపాయి.
రేషన్ కార్డు లేదంటే ఓటర్ కార్డు
Published Wed, Nov 5 2014 1:28 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM
Advertisement
Advertisement