గాంధారి, న్యూస్‌లైన్ : విద్యుత్ కోతలకు నిరసనగా మండలంలోని సర్వాపూర్ సబ్‌స్టేషన్ ఎదుట ఆ ప్రాంత రైతులు శనివారం ధర్నా, రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రోజుకు రెండు గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆరోపించారు. దీంతో పంటలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విష యం తెలుసుకున్న ట్రాన్స్‌కో ఏఈ సంతోష్‌కుమార్ సబ్‌స్టేషన్‌కు చేరుకొని రైతులతో మాట్లాడారు. ఇక నుంచి సరఫరాలో అంతరాయం లేకుండా చూస్తానని నచ్చజెప్పినా వినలేదు. కామారెడ్డి నుంచి డీఈ రావాలని డిమాండ్ చేశారు. అదే సమయంలో ముదెల్లి నుంచి గాంధారి వైపు వస్తున్న బీజేపీ నాయకుడు బాణాల లక్ష్మారెడ్డి రైతులకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నారు.
డీఈ వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజుకు ఏడు గంటలు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ఏఈ సంతోష్‌తో రాతపూర్వంగా హామీ తీసుకొ ని రైతులు ఆందోళన విరమిచారు. సుమారు నాలుగు గంటల పాటు ఆందోళన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గౌరారం మాజీ సర్పంచ్ మనోహర్‌రావు, తూం అంజయ్య, మోహ న్, జయరాం, బలిరాం, సర్వాపూర్, గండివేట్, సీతాయిపల్లి, గౌరారం, ముదెల్లి, వెంకటాపూర్ గ్రామాల రైతులు తది తరులు పాల్గొన్నారు.
విద్యుత్ కోతలకు నిరసనగా రాస్తారోకో
Published Sun, Mar 2 2014 4:04 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement