'రుణమాఫీ కోసం 25 నుంచి ఆమరణ దీక్ష'
కాకినాడ: ఈనెల 25వ తేదీ లోపల రైతుల రుణాలు మాఫీ చేయకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని భారతీయ కిసాన్ సంఘ్ హెచ్చరించింది. ఈనెల 25లోగా రుణమాఫీ అమలు చేయాలని సంఘ్ డిమాండ్ చేసింది.
రైతులు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. గెలిచిన తరువాత ఏదో ఒక సాకు చెబుతూ రుణాలు మాఫీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. దాంతో ప్రతి రైతుకు రుణమాఫీ వర్తింపజేయాలని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేస్తోంది.