ఫీజు రీయింబర్స్ మెంట్ ను కొనసాగించాలి: పీడీఎస్ యూ
ఫీజు రీయింబర్స్ మెంట్ ను కొనసాగించాలి: పీడీఎస్ యూ
Published Wed, Jun 11 2014 7:37 PM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగించాలని పీడీఎస్‌యూ తెలంగాణ కమిటీ నేతలు డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంపై చర్చించడానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో పీడీఎస్ యూ నేతలు చర్చలు జరిపారు. పేద విద్యార్ధులకు మేలు చేసే ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని కొనసాగించాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డికి సూచించారు.
గత సంవత్సరం ఉన్న చెల్లించని ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలని నేతలు విజ్ఞప్తి చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో మృతి చెందిన వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించిన వీఎన్‌ఆర్ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ నేతలు కోరారు.
Advertisement