
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం రెస్కో కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గోడౌన్‌లో నిల్వ ఉంచిన పాత మీటర్ల వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. కాగా షాట్ సర్య్కూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.