నెల్లూరు: శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాలిడ్ ప్రొపెలెంట్ ప్లాంట్ స్టోర్ రూంలో మంటలు చెలరేగి అక్కడ ఉన్న పరికరాలు అగ్నికి ఆహుతైయ్యాయి. ఈ ఘటనలో రెండు కోట్ల విలువైన పరికరాలు అగ్నిలో బూడిదైనట్టు సమాచారం. షార్ కేంద్రంలో ప్రమాదానికి సంబంధించి కారణాలు తెలియరాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే షార్ లోని సభ్యులు అప్రమత్తమైనా, భారీగా నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో రెండో ఉపగ్రహ నిర్మాణ కేంద్రాన్ని రూ.363.95 కోట్ల వ్యయంతో నిర్మించాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ రెండు నెలల క్రితం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. కేంద్ర అంతరిక్ష శాఖ ఈ ప్రాజెక్టు కోసం షార్‌లో బృందాలను ఏర్పాటు చేసేందుకు రంగ సిద్ధమైంది. ఈ తరుణంలో షార్ లో ప్రమాదం జరగడం శోచనీయం.