
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా కొండపల్లి నిఫ్టీ కంపెనీ గోడౌన్‌లో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కెమికల్ డ్రమ్స్‌కు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగడంతో పారిశ్రామికవాడ సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం అక్కడికి చేరుకుని అయిదు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. కాగా ప్రమాదస్థలికి 300 మీటర్ల దూరంలో హెచ్‌పీసీఎల్ గ్యాస్ బాట్లింగ్ ఫ్లాంట్ ఉంది. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.