
శేషాచలంలో మళ్లీ మంటలు
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో బుధవారం పలుచోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి.
సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో బుధవారం పలుచోట్ల అగ్నిప్రమాదాలు సంభవించాయి. వేసవి కాలం ప్రారంభం కావడంతో ఇక్కడి భారీ వృక్షాలు, చెట్లు ఎండిపోయి కార్చిచ్చు రేగింది. మామండూరు రేంజ్ పరిధిలోని కరకంబాడి, తిమ్మనాయుడుపాళెం బీట్ల అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం 10 గంటలకు మంటలు ప్రారంభమై రాత్రి వరకు కొనసాగాయి. వేలాది ఎకరాల అటవీ ప్రాంతం, జంతుసంపద మంటల్లో ఆహుతైంది. తమ పరిధి కాకపోయినా టీటీడీ అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పివేశారు. అలాగే, వాటి ప్రభావం వల్ల తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డుకు సమీపంలోని గురప్పకోన, చీకటికోన ప్రాం తాల్లో కూడా మంటలు వ్యాపిం చాయి. టీటీడీ అధికారులు సహా సుమారు 60 మంది సిబ్బంది మంటల్ని ఆర్పడంలో నిమగ్నమయ్యారు.