నంద్యాల(కర్నూలు): కర్నూలు జిల్లా నంద్యాల పట్టణం నూనెపల్లెలో గురువారం ఉదయం అటవీశాఖ అధికారులు సోదాలు ప్రారంభించారు. సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతం నుంచి కలపను ఇక్కడికి అక్రమంగా తరలించి విక్రయిస్తున్నారన్న సమాచారం మేరకు కలప డిపోలపై దాడులు చేస్తున్నారు. డీఎఫ్‌వో శివప్రసాద్ ఆధ్వర్యంలో జరుగుతున్న దాడుల్లో అనధికారికంగా నిల్వ ఉంచిన కలపను గుర్తిస్తున్నారు.