అడ్డగుట్ట (హైదరాబాద్) : పది నెలల నుంచి వెట్టి చాకిరీ చేస్తున్న నలుగురు బాల కార్మికులకు అధికారుల చొరవతో విముక్తి లభించింది. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రం పాట్నాకు చెందిన పదిహేడేళ్లలోపు నలుగురు బాలురు గత పది నెలలుగా లింగంపల్లి ప్రాంతం చందానగర్‌లోని ఓ రబ్బర్ కంపెనీలో కార్మికులుగా పని చేస్తున్నారు. ఆ కంపెనీ యజమాని దీపక్ వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నాడు. అన్నం కూడా సరిగా పెట్టేవాడు కాదు. దీంతో బాధితులు సోమవారం రాత్రి అక్కడి నుంచి తప్పించుకుని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం అక్కడ తిరుగుతున్న వీరిని గమనించిన దివ్యదిశ చైల్డ్ హెల్ప్ డెస్క్ సభ్యులు ఆ పిల్లలను చేరదీశారు. వారిని చైల్డ్ హెల్ప్ డెస్క్ కార్యాలయానికి తీసుకువెళ్లి భోజనం పెట్టి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారిని సైదాబాద్‌లోని గవర్న్‌మెంట్ హాస్టల్‌లో చేర్పించారు.
బాలకార్మికులకు విముక్తి
Published Tue, Jun 2 2015 7:40 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM
Advertisement