
పుష్కర తొక్కిసలాటపై చర్యలుండవు : గాలి
లక్షలాది మంది భక్తులు పాల్గొనే చోట అపశ్రుతులు జరుగుతుంటాయని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు.
కోటగుమ్మం (రాజమహేంద్రవరం)/పోలవరం : లక్షలాది మంది భక్తులు పాల్గొనే చోట అపశ్రుతులు జరుగుతుంటాయని టీడీపీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఏడాది క్రితం గోదావరి పుష్కరాల సందర్భంగా ఊహించని రీతిలో తొక్కిసలాట జరిగిందని, దాన్ని రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు.ఏంచేసినా ఎవరిపైనా చర్యలుండవని తేల్చి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు.