టిడిపి నేతలతో మాట్లాడుతున్న మాట నిజమే: గల్లా జయదేవ్ | Galla Jayadev accepted talks with tdp | Sakshi
Sakshi News home page

టిడిపి నేతలతో మాట్లాడుతున్న మాట నిజమే: గల్లా జయదేవ్

Published Sun, Jan 19 2014 5:51 PM | Last Updated on Fri, Aug 10 2018 8:01 PM

గల్లా జయదేవ్‌ - Sakshi

గల్లా జయదేవ్‌

టిడిపి నేతలతో మాట్లాడుతున్న మాట వాస్తవమేనని మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు జయదేవ్‌ అంగీకరించారు.

చిత్తూరు: టిడిపి నేతలతో మాట్లాడుతున్న మాట వాస్తవమేనని మంత్రి గల్లా అరుణ కుమారి కుమారుడు జయదేవ్‌ అంగీకరించారు. ఏ పార్టీలో చేరాలన్న అంశంపై తమ కుటుంబంలో స్వేచ్ఛ ఉంటుందని చెప్పారు. చాలా కుటుంబాల్లో ఒక్కొక్కరు ఒక్కో పార్టీలో ఉన్న విషయాన్ని ఆయన ప్రత్యేకంగా చెప్పారు. గుంటూరు నుంచి పోటీ అన్నది మంచి అవకాశంగా భావిస్తున్నట్లు  గల్లా జయదేవ్‌ తెలిపారు. అయితే ఏ పార్టీ తరపున పోటీ చేసే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. ఈ నెలాఖరుకల్లా తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు.  

ఇదిలా ఉండగా ఈ ఉదయం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ గుంటూరు లోక్సభ స్థానం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో జయదేవ్కు తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని మంత్రి గల్లా అరుణ కుమారి కూడా చెప్పారు. తమ కుటుంబ సభ్యులలో ఒకరు ఏలాంటి నిర్ణయం తీసుకున్నా మిగతా అందరి మద్దతు ఉంటుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement