అనంతపురం : ఉద్యోగాలు కల్పిస్తామంటూ పేపర్ ప్రకటన ఇచ్చి సుమారు 300ల మంది దగ్గర భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి చివరికి చేతులెత్తేసిన ఘటన అనంతపురం పట్టణంలో చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అనంతపురం పట్టణంలోని హెచ్‌ఎల్‌ఎస్ కెనాల్ సమీపంలో కృష్ణ, ప్రసాద్‌రెడ్డి, సాధిక్ వలీ అనే ముగ్గురు కలసి కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ పేరుతో ఓ సంస్థను ఈ ఏడాది జనవరిలో ఏర్పాటు చేశారు. ఉద్యోగాల నియామకాల పేరుతో పేపర్ ప్రకటన ఇచ్చారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు, కార్యాలయ ఉద్యోగాల పేరుతో 300 ల మందిని నియమించుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.25 వేల నుంచి రూ.3 లక్షల వరకు దండుకున్నారు. కాగా ఎనిమిది నెలలు గడిచినా ఇంతవరకు జీతాలు ఇవ్వకపోయేసరికి బాధితులు గత మూడు రోజుల నుంచి సంస్థ నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు. దీంతో కృష్ణ, సాధిక్లు వారిపై పట్టణ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బాధితులను పోలీసులు విచారించడంతో నిర్వాహకుల మోసం బయటపడింది. దీంతో బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు కృష్ణ, సాధిక్‌లను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఉద్యోగాల పేరుతో భారీ మోసం
Published Fri, Sep 4 2015 7:42 PM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement
Advertisement