సీబీఐ విచారణకు సిద్ధం కండి... అవినీతిని నిరూపిస్తాం
సాగునీటి ప్రాజెక్టులో రాయలసీమకు అన్యాయం
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీఅనంత వెంకట్రామిరెడ్డి
కుందుర్పి : అమరావతిలో భూముల కొనుగోలులో అక్రమాలు.. ఇ సుక ఇతరత్రా దోపిడీలను నిరూపించేం దుకు సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే టీడీపీ నేతలు సీబీఐ విచారణకు సిద్ధం కావాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. కుందుర్పి తహశీల్దార్ కా ర్యాలయం వద్ద సోమవారం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానా లపై వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మండల క న్వీనర్ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి మా జీ ఎంపీ అనంత ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామస్థాయి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, సీఎం చంద్రబాబు వరకు టీడీపీ నేతలు సీబీఐ విచారణకు ముందుకు వస్తే అవి నీ తిని నిరూపిస్తామన్నారు.
భూములు కొంటే తప్పేముందని సీ ఎం చంద్రబాబు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తా రు. సాగునీటి ప్రాజెక్టులలో రాయలసీమకు అన్యాయం జరుగుతోందన్నారు. హంద్రీనీవా, పోలవరం ప్రాజెక్టులకు అంచనా లు పెంచారు తప్ప.. నిధులు ఇవ్వలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం పచ్చ చొక్కాలకే పథకాలు మంజూరు చేస్తోందని విమర్శించారు. రెవెన్యూ, పోలీస్ ఇతర శాఖల అధికారులు పచ్చ చొ క్కాలు వేసుకున్న కార్యకర్తల్లా పని చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు తిరగబడి తరమికొట్టక తప్పదని అధికారులు, టీడీపీ నేతలను ఆయన హెచ్చరించారు. ఇసుక ఉచితం పేరుతో టీ డీపీ నాయకులు బహిరంగంగా దోపిడీ చేయడానికి సీఎం చంద్రబాబు లెసైన్సులు ఇచ్చేశారని విమర్శించారు.
రూ.86 వేల కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా రూ.24 వేల కోట్లు మాత్రమే మాఫీ చేసినట్లు సీఎం చె ప్పారన్నారు. జిల్లాకు రూ.2 వేల కోట్ల రుణమాఫీ చే యా ల్సి ఉండగా మొదటి విడతలో రూ.700 కోట్లు విడుదల చేసి అన్యాయం చేశారన్నారు. చంద్రబాబు మాటలు న మ్మి మోసపోయిన రైతన్నలు బ్యాంకు రుణాలకు వడ్డీ పె రిగి జిల్లా వ్యాప్తంగా రూ.1200 కోట్ల అపరాధరుసుం చెల్లించాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు.
మహిళలను రుణమాఫీ పేరుతో మోసం చేసి కేవలం రూ.3000 ఇచ్చి చేతులు దులుకున్నారని, చేనేతలకు రుణం ఇవ్వలేదన్నారు. నియోజకవర్గ సమన్వయక ర్త ఉషాశ్రీచరణ్ మాట్లాడుతూ సీఎం, మంత్రులు అమరావతి రాజధానిలో ల్యాండ్ ఫూలింగ్‌కు పాల్పడి వేల ఎకరాలు దండుకున్నారని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శు లు ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, తిప్పేస్వామి, సింగిల్‌విండో అ ధ్యక్షుడు రామాంజినేయులు, మాజీ మార్కెట్‌యార్డ్ చెర్మై న్ రఘునాథ్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నరేంద్రరెడ్డి పాల్గొన్నారు.