
గులాబీ గూటికి ఎమ్మెల్యే నగేశ్
నేడు టీడీపీకి రాజీనామా
ఇచ్చోడ, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్)లో చేరుతున్నట్లు బోథ్ ఎమ్మెల్యే గోడం నగేశ్ ప్రకటించారు. హైదరాబాద్ నుంచి బుధవారం నేరుగా బోథ్ మండలంలోని తన స్వగ్రామమైన జాతర్ల గ్రామానికి చేరుకుని నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలతో సమాలోచనలు జరిపారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, ఆయన విధానాలు నచ్చకనే గురువారం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు కూడా ఒత్తిడి తెవడంతో టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో టీఅర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను కలుస్తానని తెలిపారు. ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా పోటీచేసే విషయన్ని కేసీఆర్‌ను కలిసి తర్వాత ప్రకటిస్తానని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో గొడం నగేశ్ ఒక పర్యాయం మంత్రిగా, రాష్ట్ర జీసీసీ చైర్మన్‌గా, రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.