
సాక్షి, కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ–2018 జిల్లాస్థాయి పోస్టుల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. తొలి విడతగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పాఠశాల విద్యాశాఖ నుంచి బుధవారం ప్రొవిజినల్ జాబితా జిల్లాకు చేరింది. స్కూల్ అíసిస్టెంట్ ఇంగ్లీష్, గణితం, సోషల్, సైన్సు, బయోలాజికల్ సబ్జెక్టుల్లో జాబితా వచ్చినట్లు తెలిసింది. 2018 డిసెంబర్ 24 నుంచి 28 వరకు ఆన్‌లైన్‌లో డీఎస్సీ మొదటి విడత పరీక్షలను నిర్వహించిన సంగతి తెలిసిందే. 24, 26, 27 తేదీలలో 102 స్కూల్ అసిస్టెంట్(నాన్ లాంగ్వేజెస్) పోస్టులకు.. 28న 11 భాషా పండితుల పోస్టులకు 7739 మంది పరీక్షను రాశారు. రెండవ విడతలో ఎస్‌జీటీలకు 18 నుంచి 31 వరకు పరీక్షలను నిర్వహించారు. 78 సెకండ్ గ్రేడ్ టీచర్ పోస్టులకు 15,278 మంది పరీక్ష రాశారు.
పోస్టుల వివరాలు ఇలా...
జిల్లా పరిషత్, గవర్నమెంట్ మేనేజ్‌మెంట్‌లలో 187 పోస్టులు, మున్సిపాలిటికి సంబంధించి 39 పోస్టులను భర్తీ కానున్నాయి. భాషా పండితులు, వ్యాయాయ ఉపాధ్యాయ పోస్టులపై న్యాయస్థానంలో వ్యాజ్యం ఉన్నందున స్పష్ట్టత రావాల్సి ఉంది. ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. ఇందుకు రెండ్రోజుల సమయం కేటాయించారు. అనంతరం స్థానికంగా ధ్రువవత్రాలను
పరిశీలిస్తారు. వీరిలో అనర్హులుంటే తొలగించి వారి స్థానాల్లో తదుపరి వారికి అవకాశం కల్పిస్తారు. అనర్హుల స్థానంలో ఎంపికైన వారు ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి.పరిశీలించి ఎంపిక జాబితాను రూపొందిస్తారు. ఇలా పోస్టుల సంఖ్య అనుగుణంగా అభ్యర్థులు ఎంపికయ్యే వరకు ప్రక్రియ సాగుతుంది.
నియామక షెడ్యూల్ ఇలా....
ఆగస్టు 5 వరకు స్కూల్ అసిస్టెంట్, ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 4 వరకూ ఎస్‌జీటీలకు కౌన్సెలింగ్‌ను నిర్వహించి నియామక ఉత్తర్వులు జారీ చేసేలా షెడ్యుల్‌ను రూపొందించారు. ఎస్‌జీటీలకు సంబంధించి ఆగస్టు 2 నుంచి అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రకటిస్తారు. 6,7 తేదీలలో సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేస్తారు. 29న తుది జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 1న వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 4న పోస్టుంగ్ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment