త్రిశంకు స్వర్గంలో బిల్లులు | Government bills | Sakshi
Sakshi News home page

త్రిశంకు స్వర్గంలో బిల్లులు

Published Thu, Apr 23 2015 3:37 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Government bills

 కర్నూలు(సిటీ): జిల్లాలో చిన్ననీటి పారుదల శాఖ పరిధిలోని చెరువుల అభివృద్ధి పనులు చేసినా కాంట్రాక్టర్లకు పది నెలలు గడిచినా ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదు. ఉన్నతాధికారులు జాప్యం చేస్తుండటంతో కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కూరుకపోతున్నారు. చెరువులకు శాశ్వత మరమ్మతులు చేసి భూగర్భ జలాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2008 సంవత్సరంలో మరమ్మతులు, పరిరక్షణ, పునరుద్ధరణ(త్రిబుల్ ఆర్) పథకాన్ని చేపట్టింది. రాష్ట్రంలో ఈ పథకాన్ని 2011-12 సంవత్సరం నుంచి అమలవుతుంది. ఫేజ్-2 కింద 78 వర్కులు చేపట్టేందుకు రూ.20 కోట్లతో మంజూరు చేసింది. ఫేజ్-2 కింద మంజూరైన నిధులలో సుమారు 10 కోట్ల బిల్లుల దాకా చెల్లింపులు చేశారు. పది నెలల క్రితం పూర్తి అయిన 8 వర్కర్లకు సంబంధించిన రూ.90,45,500  బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లుల చెల్లింపుకు సంబంధిత శాఖ ఇంజనీర్లు జిల్లా కలెక్టర్‌కు ప్రతిపాదించారు.
 
 అదిగో... ఇదిగో... అంటూ సుమారు 7 నెలల తర్వాత చెరువుల పనుల్లో నాణ్యత లేదంటూ మరోసారి నాణ్యతపై విచారణ చేయించేందుకు త్రిసభ్య కమిటీని ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమించారు. బిల్లుల చెల్లింపునకు కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ రెండు నెలలు అయినా రెండు వర్కులను కూడా పరిశీలించలేదని తెలిసింది. వీరి నివేదిక ఆధారంగానే బిల్లుల చెల్లింపులు చేస్తామని కలెక్టర్ చెప్పడంపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి ధోరణిలో ఉన్నతాధికారులు ఉంటే అభివృద్ధి పనులు ఏ మేరకు పూర్తి అవుతాయోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
 
 బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలే శరణ్యం
 ఫేజ్-2 కింద పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించకుంటే ఆత్మహత్యలు చేసుకోవడమే శరణ్యం అంటూ కొందరు కాంట్రాక్టర్లు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనుల్లో నాణ్యత పరిశీలనకు క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలను కాదని జిల్లాకలెక్టర్  త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడంపై పలువురు తప్పుబడుతున్నారు. చెరువుల పనులు పూర్తి చేసేందుకు కొంతమంది కాంట్రాక్టర్లు పొలాలు, బంగారు నగలు తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి పనులు చేయించినా... నాణ్యత సాకుతో బిల్లులు మంజూరు చేయడంలో జాప్యం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం కాంట్రాక్టర్లు తెలుగు గంగా అతిథి గృహంలో సమావేశమై పెండింగ్ బిల్లులు చెల్లించేంత వరకు ఏ ఒక్కరూ పనులు చేయకూడదంటూ తీర్మానించుకున్నట్లు తెలిసింది. దీంతో పలుచోట్ల చెరువుల పనులు నిలిచిపోయాయి. ఫేజ్-3 పనులు చేసేందుకు ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదని జలవనరుల శాఖ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.  
 
 త్రిసభ్య కమిటీ నివేదిక అందలేదు
 త్రిబుల్ ఆర్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుపై కలెక్టర్ నియమించిన త్రిసభ్య కమిటీ నివేదిక అందలేదు. ఆ నివేదిక ప్రకారం బిల్లులు చెల్లించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. కాంట్రాక్టర్ల ఇబ్బందుల గురించి మాకెలా తెలుస్తుంది.                 
 - శ్రీనివాసులు, ఈఈ, మైనర్ ఇరిగేషన్, కర్నూలు  
 
 కాంట్రాక్టర్లు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడం లేదు
 త్రిబుల్ ఆర్ కింద చేపట్టిన పనులకు సంబంధించిన వాటిని విచారించాలని కలెక్టర్ త్రిసభ్య కమిటీ నియమించారు. నివేదిక ఇచ్చేందుకు కొంతమంది కాంట్రాక్టర్లు పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడం లేదు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాం.                   
 - పాండురంగయ్య, త్రిసభ్య కమిటీ సభ్యులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement