రోడ్డు ప్రమాదంలో గాయపడి పదో తరగతి పరీక్ష రాసేందుకు తమ తల్లులతో కలిసి పరీక్ష కేంద్రాలకు వచ్చిన వైష్ణవి
సాక్షి, గుంటూరు: భవిష్యత్‌పై కొండంత ఆశతో వేకువజామునే బడికి బయలుదేరిన ఆ చిన్నారులను మృత్యువు రూపంలో దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు చిదిమేసింది. ఆటో డ్రైవర్, నలుగురు విద్యార్థులు ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ దుర్ఘటన తెలిసిన ప్రతిఒక్కరూ అయ్యోపాపం అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం మాత్రం బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో పరిహాసమాడుతోంది. ఆ ప్రమాదంలో విద్యార్థినులుకనుమర్తి గాయత్రి (15), ఆళ్లు రేణుక (15), పొట్లపల్లి శైలజ (15), మున్నంగి కార్తీక్ రెడ్డి (15), ఆటోడ్రైవర్ రేపూడి ధన్‌రాజ్ (28) మరణించగా, పొట్లపల్లి భాను, పొట్లపల్లి వైష్ణవి, ఆళ్లకుంట శిరీష గాయపడ్డారు.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న చిన్నారులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా ఉన్నతాధికారులు పరామర్శించారు. మృతుల కుటుం బాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇస్తామంటూ ప్రకటించారు. పాఠశాల యాజమాన్యం మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ నుంచి సైతం బాధిత కుటుంబాలకు మరికొంత ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటిం చారు. అయితే ఆ తరువాత బాధిత కుటుం బాలు అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదిక్షణలు చేసినా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారు. గాయాపాలైన పొట్లపల్లి భాను, పొట్ల పల్లి వైష్ణవి, ఆళ్లకుంట శిరీష తల్లిదండ్రులు నిరుపేదలు కావడంతో వైద్యం చేయించేందుకు డబ్బు లేక ప్రభుత్వం సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ముగ్గురు ఇప్పటికీ స్టాండ్ సాయం లేనిదే నడవలేరు. ఏడు నెలలుగా వీరికి చికిత్స చేయించేందుకు రూ.లక్షల్లో ఖర్చయిందని వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ సాయం అందితే ఆస్పత్రి ఖర్చుల కోసం చేసిన అప్పులు తీర్చొచ్చని ఎదురు చూస్తున్నారు. అయితే వారిని పరిహాసమాడుతూ ప్రభుత్వం గురువారం పరి హారాన్ని పరిహాసం చేస్తూ జీఓ జారీ చేసింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.18 లక్షలు మంజూరు చేస్తూ పరిహారాన్ని మంజూరు చేస్తూ జీఓ విడుదల చేసింది.
వైఎస్ జగన్ నిలదీయడంతో కదలిక
ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తాడికొండ నియోజకవర్గం పేరేచర్ల సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను బాధిత కుటుంబాలు కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించి, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాపోయాయి. ప్రమాదంలో మృతిచెందిన ఆటోడ్రైవర్ ధన్‌రాజ్ భార్య త్రివేణి ఎనిమిది నెలల గర్భిణినైన తనకు కూడా ప్రభుత్వ సహాయం అందడం లేదన్నా జగన్ ఎదుట భోరున విలపిం చారు. బాధిత కుటుంబాల ఆవేదనను అర్థం చేసుకున్న జననేత జగన్ పేరేచర్ల సెంటర్, గుంటూరు నగరంలో జరిగిన బహిరంగ సభల్లో చిన్నారులను కోల్పోయి బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న నరకయాతనను ప్రస్తావించారు. బాధితులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయకపోతే వైఎస్సార్ సీపీ తరఫున ఆందోళన చేపడ్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ బాధితుల పక్షాన నిలబడడంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిం చింది. అయితే అందులో మోసం చేసింది. ఘటన జరిగిన సమయంలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షలు ప్రకటిం చిన ప్రభుత్వం మాట తప్పింది. మృతుల కుటుం బాలకు రూ.3 లక్షలు, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున రూ.18 లక్షలు మంజూరు చేసింది. ప్రభుత్వం మాటమార్చి పరిహారం మొత్తాన్ని తగ్గించడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment