వారికి అనుగుణంగా రాష్ట్ర రోడ్లను జిల్లా రోడ్లుగా డీనోటిఫై
- మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై మద్యం అమ్మకాలు నిలిచిపోవడంతో వాటిని కొనసాగించేందుకు ఆ రహదారులను జిల్లా రహదారులుగా మార్చి అమ్మకాలను యధేచ్చగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర రహదారులను జిల్లా రహదారులుగా డీనోటిఫై చేయనుంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో మద్యం షాపులను యజమానులు జనావాసాలకు తరలించడంతో మహిళలు పలుచోట్ల పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. దీంతోజనావాసాల నుంచి మద్యం షాపులను తరలించే నెపంతో వాటిని తిరిగి రహదారుల పక్కకే మారుస్తూ మద్యం షాపుల యజమాను లకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకోసం రాష్ట్ర రహదారులను జిల్లా రహదారులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకనుగుణంగా త్వరలో జీఓ జారీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి...
► మద్యం షాపులకు దేవుళ్ల పేర్లు పెట్టకూడదని యజమానులకు మంత్రివర్గం విజ్ఞప్తి.
► హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగమైన సొరంగ మార్గం (ప్రధాన కాల్వపై 506 కి.మీ. నుంచి 511 కి.మీ. వరకు) వల్ల ఇబ్బందులు వచ్చిన నేపథ్యంలో దాని స్థానంలో ఎత్తిపోతల పథకాన్ని నిర్మించాలనే ప్రతిపాదనకు ఆమోదం.
► 2015లో వడ్డీ వ్యాపారుల కోసం చేసిన బిల్లు స్థానంలో ఏపీ మనీ లెండర్స్ బిల్‌ృ2017కు ఆమోదం. దీనిప్రకారం వడ్డీ వ్యాపారులు తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంది.
► మున్సిపాల్టీల్లోని లేఅవుట్లకు త్వరలో ఆన్‌లైన్ ద్వారా అనుమతులు మంజూరు చేయడానికి అనుమతి. ఇందు కోసం ఏపీ మున్సిపల్ చట్టం 1965 సెక్షన్ 184 (4) (జీజీ)ని సవరించి, మున్సిపల్ కౌన్సిల్‌కు బదులుగా మున్సిపాల్టీలలో లేఅవుట్లు, భూ ముల సబ్ డివిజన్ మంజూరు అధికారం కమిషనర్లకు ఇచ్చేందుకు అనుమతి. మున్సిప ల్ కార్పొరేషన్లలో వంద గజాల లోపు ప్రభుత్వ స్థలాలు, గ్రూపు హౌసులు నిర్మించ డానికి వీలు లేని చోట్ల ఆక్రమించి బీపీఎల్ కుటుంబా లు నిర్మించుకున్న ఇళ్లను క్రమబద్ధీకరిం చేందుకు ఆమోదం.