
Ambati Rambabu
గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షను భగ్నం చేయడం, ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లిన తీరును దుర్మార్గమైన చర్యగా ఆ పార్టీ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. దీక్షా శిబిరం వద్ద నేతలు, కార్యకర్తల పట్ల పోలీసులు దారుణంగా ప్రవర్తించారని చెప్పారు. మహిళల పట్ల కూడా వారు అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలిపారు. రాష్ట్రప్రభుత్వం పనిగట్టుకొని పోలీసులతో ఈ విధంగా చేయిస్తుందన్నారు. ప్రజాదరణ గల ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలు, ఆ వయసులో అయిదు రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న ఒక మహిళను ఆస్పత్రికి తరలించే తీరు ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పట్ల ప్రభుత్వం కక్షకట్టి వ్యవహరిస్తున్నట్లుగా ఉందన్నారు.
విజయమ్మ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి కూడా ఆమె నిరాకరిస్తున్నట్లు చెప్పారు.